Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?

చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆమెకు పోలీసులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Andhra News: పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం.. అసలు మ్యాటరేంటంటే?
Andhra Crime (2)

Edited By:

Updated on: Jan 11, 2026 | 2:49 PM

కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్ని వదలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఘనుడు.. చదివింది న్యాయశాస్త్రం అయినా తన స్వంత భార్యా, పిల్లల్ని పట్టించుకోకుండా అన్యాయం చేశాడు. కుటుంబాన్ని వదిలేసి మరో మహిళతో కలిసి మరో ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. దీంతో తనకు న్యాయం కావాలంటూ ఆ న్యాయవాది, భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది.

కట్టుకున్న భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని తన కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని భర్తి ఇంటి ముందు పిల్లలతో కలిసి మౌనపోరాటానికి దిగింది ఓ వివాహిత మహిళ. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాలలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చీరాల క్రిస్టియన్ పేటకు చెందిన మేడ కిరీటికి, నెల్లూరుకు చెందిన ముంగా దీపకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే భర్త మేడ కిరిటి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.

ఈక్రమంలోనే మరొక మహిళతో న్యాయవాది కిరిటికి పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతప్పటి నుంచి కిరిటి తన పిల్లలను పట్టించుకోవడం లేదని భాదితురాలు దీప ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. వివాహేతర సంబంధాన్ని నిలదీసిన క్రమంలోనే ఆరు నెలల క్రితం తనను, తన పిల్లలను వదిలేసి నెల్లూరు నుంచి తన భర్త కిరీటి చీరాలకు మకాం మార్చినట్టు తెలిపింది.

తనను, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా ఇక్కడే నివాసం ఉంటున్నారని దీపిక ఆరోపించింది. చీరాలలో భర్త ఇంటి వద్ద రోడ్డు పై పిల్లలతో నిరసనకు దిగింది. సమాచారం అందుకున్న చీరాల వన్ టౌన్ పోలీసులు బాధితులను స్టేషన్ తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.