
ఏపీలోని రైతులకు గుడ్‌న్యూస్. గత రెండేళ్లుగా పండించిన పంటకు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, పంట కోసం తెచ్చుకున్న అప్పులు తిరిగి చెల్లించకలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండేళ్లగా పండించిన పంటకు చాలా తక్కువ ధరలు ఉండటంతో నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. సంక్రాంతి వరకు వరకు ఇదే పరిస్థితి ఉండగా.. పండుగ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. రైతులు పండుగ చేసుకునే పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు రకాల పంటలకు ధరల ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటివరకు ధరలు లేక ఇబ్బంది పడ్డ రైతులు.. ఈ వార్తతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో మిర్చి, వేరు శనగ పంటకు ధరలు పెరిగాయి. సంక్రాంతి తర్వాత దేశంలో కారం కాయలకు డిమాండ్ పెరగడంతో మిర్చి ధరలు కూడా హైక్ అయ్యాయి. ప్రస్తుతం సాధారణ రకం మిర్చి ధర క్వింటాకు రూ.18 వేలు పలుకుతోంది. ఇక పసుపు రకం మిర్చి క్వింటా ఏకంగా రూ.49,200 పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ పసుపు రంగు మిర్చిని రెస్టారెంట్లలో వంటకాల తయారీతో పాటు సాస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మిర్చి రకం తొలుత ఆకుపచ్చగా ఉన్నా.. ఆ తర్వాత పసుపు రంగులోకి మారుతుంది. వీటిన ఎండబెట్టినా పసుపు రంగులోనే కనిపిస్తాయి. ఈ ప్రత్యేక పసుపు రంగు మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో వీటి ధరలు భారీగా పలుకుతుండటంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అయితే సాధారణ మిర్చి రకంతో పోలిస్తే ఈ పసుపు రంగు మిర్చి పంట దిగుమతి తక్కువగా ఇస్తుందని రైతులు చెబుతున్నారు.
సాధారణ మిర్చి రకం పంట ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి ఇస్తే.. ఈ ప్రత్యేక పసుపు రకం మిర్చి కేవలం 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఎకరానికి ఇస్తుంది. అయితే వీటి రకరానికి ధర ఎక్కువగా ఉండటంతో వీటిని పండించిన రైతులకు కాసుల పంట పండనుంది. అటు వేరుశెనగ పంటల ధరలు కూడా రాష్ట్రంలో పెరిగాయి. క్వింటా వేరుశెనగ రూ.9,652 పలుకుతోంది. ఇప్పటివరకు ఇదే అతి పెద్ద రికార్డుగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా నూనె గింజలకు డిమాండ్ పెరిగింది. దీంతో వేరుశెనగ పంట ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎక్కువ రాయలసీమ ప్రాంతాల్లో వేరుశెనగ ఎక్కువగా పండిస్తారు. గత కొన్నేళ్లుగా ధరలు లేకపోవడంతో ఈ పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.