Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!

సాధారణంగా ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడికి భక్తులు ఎక్కువగా వెళ్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఆ దేవాలయానికి కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళుతూ ఉంటారు. ఆ దేవాలయం ఉన్న గ్రామంలో తాజాగా జరిగిన ఓ దారుణం ఎంతో మంది హృదయాలను కలిచివేస్తోంది. ఇంతకూ ఆ దేవాలయం ఉన్న గ్రామంలో జరిగిన దారుణం ఏంటి.?

Andhra Pradesh: అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది..!
stray dogs
Follow us
M Sivakumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 12, 2024 | 5:14 PM

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగంచిప్రోలులో రెండేళ్ల బాలుడిని పొలాల్లోకి వీధికుక్కలు ఈడ్చుకెళ్లాయి. తీవ్రంగా గాయపరిచి అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటనతో పెనుగంచిప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి అతడి ప్రాణాలు తీసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగ్గయపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి ఈడ్చుకెళ్లిపోయాయి. దీంతో బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు బాలుడిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్ కుమార్ ప్రాణాలు వదిలాడు. అయితే.. గ్రామంలో కుక్కల బెడద గురించి స్థానిక పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందన లేదంటూ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుమారుడి ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బాలుడి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడు తమకు ఎన్నో ఏళ్ల తర్వాత జన్మించాడని.. అలాంటి తన కుమారుడిపై కుక్కలు దాడి చేసి చంపడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. పెనుగంచిప్రోలులో దాదాపు నాలుగు వేల వీధికుక్కలు ఉన్నట్లు గ్రామ సర్పంచ్ పద్మకుమారి తెలిపారు. గ్రామంలో ప్రముఖ దేవస్థానం ఉండటంతో.. తిరుపతమ్మ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో తిరుపతమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

తిరుపతమ్మ ఆలయానికి వచ్చే భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత గొర్రెలు, మేకలతో దావత్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో గొర్రెల వ్యర్థాలు పడేయటంతో కుక్కలకు భారీగా ఆహారం లభిస్తుంది. దీంతో ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సాధారణంగా వీధి కుక్కలను ప్రతి ఆరునెలలకు ఒకసారి ఫారెస్ట్ ఏరియాకు మున్సిపాలిటీ సిబ్బంది తరలిస్తుంటారు . అయినప్పటికీ.. అక్కడ కుక్కలు చాలా ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులపై దాడులు చేసి వారి ప్రాణాలను తీస్తున్నాయి. తాజా ఘటనలో రెండేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణాలు తీయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కుల దాడిలో రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే.. తమ గ్రామంలో అసలు వీధి కుక్కలను లేకుండా చేయాలంటూ పెనుగంచిప్రోలు గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి