Chicken Price: మాంసం ప్రియులకు షాక్‌.. కొండెక్కిన కోడి ధరలు.. మరో నెల పాటు ఇవే రేట్లు..

|

Jun 10, 2023 | 11:31 AM

డిమాండ్‌ పెరడంతో ధర ఎంత ఉన్న ప్రజలు తప్పనిసరిగా చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైం హైరేట్ కి చేరింది. మరోనెల రోజుల పాటు ఇవే రేట్లు కొనసాగే చాన్స్ ఉందంటున్నారు కోళ్ల ఫామ్ నిర్వహకులు. విజయవాడ, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో చికెన్‌ రేట్‌ అమాంతంగా పెరిగింది.

Chicken Price: మాంసం ప్రియులకు షాక్‌.. కొండెక్కిన కోడి ధరలు.. మరో నెల పాటు ఇవే రేట్లు..
Chicken Price
Follow us on

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌గా చెప్పాలి. ఎందుకంటే, ఆంధ్ర, తెలంగాణలో బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ, చికెన్‌ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 పలికింది. కానీ, గత 15- 20 రోజులుగా రూ.300 నుంచి రూ.350కి పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ.350లకు చేరుకుంది. డిమాండ్‌ పెరడంతో ధర ఎంత ఉన్న ప్రజలు తప్పనిసరిగా చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైం హైరేట్ కి చేరింది. మరోనెల రోజుల పాటు ఇవే రేట్లు కొనసాగే చాన్స్ ఉందంటున్నారు కోళ్ల ఫామ్ నిర్వహకులు. విజయవాడ, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో చికెన్‌ రేట్‌ అమాంతంగా పెరిగింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 350 కాగా, కిలో బోన్‌లెస్ చికెన్ ధర రూ.700లకు చేరింది. ఇక కోళ్ల ఫారంలోనే లైవ్ బర్డ్ కిలో రూ.166లకు పలుకుతోంది.

అయితే, గతంలో ఏటా ఎండా కాలంలో తగ్గే చికెన్‌ ధరలు గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. పెళ్లిళ్లు కూడా జరుగుతున్నందు వల్ల చికెన్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్‌ సెంటర్ల ఓనర్లు చెబుతున్న మాటలు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు ఎక్కువగా చనిపోతుంటాయి. కోళ్ల పెంపకం తగ్గడం వల్ల షార్టేజ్‌ ఏర్పడుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వేసవి కారణంగా ఫారాలు కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించాయి. దాని ప్రభావం ధరలపై పడుతోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

చికెన్ ధర గడిచిన 20 రోజుల్లో రూ.260 నుంచి క్రమంగా పెరుగుతూ ఆదివారం నాటికి రూ.300, రూ. 300కి చేరింది. ఇక రేపటి ఆదివారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్‌‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.