Badvel By Election Result: బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో మొదటనుంచి అధికార వైసీపీ జోరు కొనసాగుతూ వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. బద్వేల్‌లో వైసీపీ గెలుపు అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా తీర్పు సంతోషంగా ఉందని తెలిపారు. బద్వేల్ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెజారిటీతో వైసీపీ బాధ్యత మరింత పెరిగిందని స్పష్టంచేశారు. గత రెండున్నారేళ్ల కాలంలో పలు పార్టీల నాయకులు అనేక నిందలు మోపారని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పోటీలో ఉన్నా.. కథ మొత్తం నడిపింది టీడీపీనే అని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉందని.. ప్రతిపక్షాలకు గుణపాఠం తెలిపారని వెల్లడించారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని స్పష్టంచేశారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని.. సీఎం జగన్ నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. బీజేపీ వెనకాల నుంచి మొత్తం నడిపించిందని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఓటర్లు సరైన సమాధానమిచ్చారని పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వైసీపీ నేతలు..
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు. వారితోపాటు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎంని కలిశారు.
Also Read: