స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పేదలకు ఇళ్లు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకం, నాడు-నేడుపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని, 2022-23 సంవత్సరంలో 10,200 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న భూ హక్కు, భూ రక్షా పథకం.. నాడు నేడు కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు సీఎం. స్పందన కంటే మరింత మెరుగ్గా జనాలకు సేవలు అందించేలా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని మే 9న ప్రారంభిస్తున్నట్టు సీఎం చెప్పారు. దీనికి 1902 అనే హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటు చేశారు. అత్యంత నాణ్యతతో సమస్యలు పరిష్కరించాలన్నదే కొత్త ప్రోగ్రామ్ ఉద్దేశంగా తెలిపారు జగన్.
ప్రభుత్వ విభాగాల్లోని జిల్లా అధికారులు ప్రతి శనివారం హౌసింగ్ కాలనీలకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. బాగా పనిచేసిన కలెక్టర్లను గుర్తిస్తామని… రాష్ట్రంలోని 15వేల మంది మహిళా పోలీసులకు మెరుగైన శిక్షణ ఇస్తే సచివాలయాల పరిధిలో మంచి ఫలితాలు వస్తాయన్నారు జగన్. విద్యాసంస్థల్లో డ్రగ్స్ విక్రయాలు.. వినియోగంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు
మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా.. ఉన్నా వాటిని సత్వరం పరిష్కరించేలా కార్యక్రమాలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం