Guntur: 100కే గ్రాము బంగారం.. 10కే కేజీ కందిపప్పు.. కట్ చేస్తే..

ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్... ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులున్నారు. వీరు పేదలకు సేవా చేయాలనుకుంటున్నారు. అందుకే తక్కువ ధరకే నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు. సభ్యత్వం తీసుకుంటే తక్కువ ధరకే అన్ని వస్తువులు అందుతాయని శ్రీనివాసరావు, అనంత లక్ష్మీ, నిర్మల్ అనే వ్యక్తులు ప్రచారం చేశారు.

Guntur: 100కే గ్రాము బంగారం.. 10కే కేజీ కందిపప్పు.. కట్ చేస్తే..
Gold

Edited By: Ram Naramaneni

Updated on: Feb 27, 2024 | 12:38 PM

గ్రాము బంగారం 100 రూపాయలే…కేజీ కందిపప్పు కూడా పది రూపాయలే… మీరు మంచి తరుణం మించిన దొరకదు. ఎక్కడో కాదు మన గుంటూరులోనే… అయితే అందరికీ కాదు. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికే.. అది కూడా మూడు వందల సభ్యత్వం తీసుకుంటే నిత్యావసర వస్తువులు మూడు సార్లు తీసుకోవచ్చు… వెయ్యి రూపాయల సభ్యత్వం ఉంటే ఏకంగా ఎన్నిసార్లైనా నిత్యవసర వస్తువులు పట్టుకెళ్లవచ్చు అంటూ ప్రచారం ప్రారంభించారు. ప్రచారం మాత్రమే కాదు ఏకంగా షాపు కూడా తెరిచారు. ఒకరిదిద్దరికీ ఇచ్చారు. కూడా ఆ తర్వాత ఏకంగా గ్రాము బంగారం వంద రూపాయలకే ఇస్తామంటూ మరో ప్రచారం చేశారు. అంతే కాదు పది గ్రాముల బంగారం 1500 లకే అంటూ ఊదరగొట్టారు. ఇక్కడ కూడా ఒక్కరిద్దరికి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని తండోపతండాలుగా జనం రావడంతోనే రేటు మార్చేశారు. నాలుగు గ్రాములు పదిహేను వేలు, పది గ్రాముల బంగారం 24000 అంటూ చెప్పారు. దీంతో చాలామంది డబ్బులు కట్టారు. అదే విధంగా వేలకి వేలు కట్టి సభ్యత్వం కూడా తీసుకున్నారు. తీరా బంగారం ఇవ్వమని అడిగితే విదేశాల నుండి వస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారని రాజకీయ నేతల చేత రికమండేషన్ చేయించుకొని బంగారాన్ని విడిపించడానికి వెళ్లారంటూ ప్రచారం చేశారు. ఇదంతా ట్రాష్ అని తెలుసుకొన్న బాధితులు గుంటూరు పోలీసులను ఆశ్రయించారు.

ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్… ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులున్నారు. వీరు పేదలకు సేవా చేయాలనుకుంటున్నారు. అందుకే తక్కువ ధరకే నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు. మీరు కూడా సభ్యత్వం తీసుకుంటే తక్కువ ధరకే అన్ని వస్తువులు అందుతాయని శ్రీనివాసరావు, అనంత లక్ష్మీ, నిర్మల్ అనే వ్యక్తులు ప్రచారం చేశారు. అంతేకాదు గుంటూరు నగరంలోని మంగళదాసు నగర్ లో షాపు కూడా పెట్టేశారు. దీంతో అనేక మంది సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. వీటితో పాటు టివి ఐదు వేలకే, ప్రిజ్ 3500, డబుల్ కాట్ మంచం ఏడు వేలే అంటూ నమ్మబలికారు. అందరి చేత డబ్బులు కట్టించుకున్నారు. ఇది ఇలా ఉండగానే గ్రాము బంగారం వంద రూపాయలే అంటూ మరో కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఒకరిద్దరి గ్రాము బంగారం అందిచారు కూడా..దీంతో స్థానికంగా ఉండే అమాయకులైన మహిళలు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకొని డబ్బులు కట్టడం మొదలు పెట్టారు. ఒక్క గుంటూరే కాదు తెనాలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఇలా ప్రచారం మొదలు పెట్టారు. దీంతో మూడు వందలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. మూడు కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారు.

కొద్ది రోజుల నుండి శ్రీనివాసరావు అందుబాటులో లేకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లాడని ఆరా తీస్తుంటే విదేశాలనుండి వస్తున్న బంగారాన్ని విమానాశ్రయంలో పట్టుకున్నారని విడిపించడానికి శ్రీనివాసరావు వెళ్లినట్లు చెప్పారు. రోజులు గడిచినా అతను పత్తా లేడు. దీంతో మోసపోయాని తెలుసుకున్న బాధితులు ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుకు స్పందించిన ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…