AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. వారికి ఆహ్వానం..

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళాయింది. సుమూహుర్తం ఖరారైంది. ఈ నెల 12.. బుధవారం. ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సం చేస్తారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీపార్క్‌ సమీపంలోని సువిశాల ప్రాంతంలో ప్రమాణస్వీకార సభా ఏర్పాట్లు జోరందుకున్నాయి.

Chandrababu: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. వారికి ఆహ్వానం..
Chandrababu
Ravi Kiran
|

Updated on: Jun 07, 2024 | 9:38 PM

Share

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళాయింది. సుమూహుర్తం ఖరారైంది. ఈ నెల 12.. బుధవారం. ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సం చేస్తారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీపార్క్‌ సమీపంలోని సువిశాల ప్రాంతంలో ప్రమాణస్వీకార సభా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రమాణస్వీకారోత్సవ వేడుక  అమరావతిలోనే .  వేదిక తాడేపల్లిలో అనే ప్రచారం జరిగింది. రాయపూడి లేదంటే  ఉద్దండ్రాయునిపాలెం పేర్లు కూడా విన్పించాయి. ఆ తరువాత బ్రహ్మానందపురం పేరు తెరపైకి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు, అధికారులతో కలిసి బ్రహ్మానందపురంలో స్థలాన్ని పరిశీలించారు. సభా నిర్వహణకు స్థలం విశాలంగానే ఉన్నప్పటికీ రావడానికి వెళ్లడానికి మార్గం ఒకటే ఉండడంతో సుముఖుత వ్యక్తం చేయలేదాయన. మరింత అనువైన ప్రదేశం కోసం ఆరా తీశారు అచ్చెన్నాయుడు.

ఆ క్రమంలోనే గన్నవరం ఏరియాపై దృష్టిసారించారు. ఎట్టకేలకు కేసరపల్లి ఐటీ పార్క్‌ దగ్గర సువిశాల ప్రదేశాన్ని ఎంపిక చేశారు. పక్కనే  హైవే  ఉంది. ప్రజలు రావడానికి అనువుగా ఉంటుంది. పైగా ఎయిర్‌పోర్టు కూడా కూతవేటు దూరంలో ఉంది. సో.. వీఐపీల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా సభా స్థలికి చేరుకోవచ్చు. ఇలా అన్ని విధాల అనువుగా ఉండడంతో ఈ ప్రదేశంలోనే ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వెనువెంటనే చకాచకా పనులు కూడా ప్రారంభమయ్యాయి.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

ఇవి కూడా చదవండి

9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు ,పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారు. 11న నిర్వహించే టీడీఎల్పీ సమావేశంలో  చంద్రబాబును శాసన సభ పక్ష  నాయకుడిగా ఎన్నుకుంటారు. 12..బుధవారం ఉదయం  11గంట 27 నిమిషాలకు   ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఏపీ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబుకు దేశ ,విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు.. పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకాబోతున్నారు. దాదాపు  70 వేల మందికి సరిపడేలా కేసరపల్లి లో  సభా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌, పార్కింగ్‌ సహా మరే ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా అత్యంత భద్రత మధ్య  పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..