Chandrababu Naidu: 4వసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. పూర్తి రాజకీయ ప్రస్థానం ఇలా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరు అయ్యారు.

Chandrababu Naidu: 4వసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. పూర్తి రాజకీయ ప్రస్థానం ఇలా..
Chandrababu

Updated on: Jun 12, 2024 | 1:13 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.

1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత 1999లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. విభజన రాష్ట్రంలో 2014 నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. 2024లో మరోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి తెలుగుజాతికే చెరిగిపోని ముద్రను వేశారు. ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తైతే మొత్తం 19ఏళ్ల పాటు తన విలువైన సేవలను రాష్ట్రానికి అందించిన వారి ఖాతాలో చెరిగిపోని ముద్ర వేసుకోనున్నారు. చంద్రబాబు పీఠమెక్కిన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలంగా ఉండేది. టెక్నాలజీ మొదలు వ్యవసాయం వరకు, విద్య మొదలు మద్యం వరకు ప్రతి నిర్ణయంలో తనదైన మార్క్ చూపించారు. గతంలో హరితాంధ్రప్రదేశ్ సాధకుడిగా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సేవకుడిగా కూడా పేరొందారు. తాజాగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడిగా తన అడుగుల వేగం పెంచుతూ అభివృద్దిదిశగా ముందుకు సాగుతున్నారు.

చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానం ఇలా..

  • 8వ సారి ఎమ్మెల్యే..
  • 4వసారి ముఖ్యమంత్రి..
  • 4 దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం..
  • 1975-యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. కష్టకాలం ఎదురైన ప్రతిసారీ బౌన్స్‌ బ్యాక్‌ అవుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.
  • 1978-తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు
  • 1980- అంజయ్య కేబినెట్‌లో మంత్రి
  • 1983-ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఓటమి
  • 1986-టీడీపీ ప్రధాన కార్యదర్శి
  • 1989-కుప్పం నుంచి ఎమ్మెల్యేగా విజయం
  • 1995-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి
  • 1996-యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌
  • 1999-జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర
  • 1999-రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నిక
  • 2003-అలిపిరి దగ్గర క్లెమోర్‌ మైన్లతో మావోయిస్టుల దాడి
  • 2004-2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత
  • 2014- విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి
  • 2019- నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత
  • 2024-నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..