Chandrababu: సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చింది: చంద్రబాబు

|

Jun 07, 2024 | 1:10 PM

ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని ఆయన అన్నారు. ఆయనేమన్నారో తెలుసుకుందాం పదండి....

Chandrababu: సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చింది: చంద్రబాబు
Modi - Chandrababu - Nitish Kumar
Follow us on

లాంఛనం పూర్తయ్యింది. శనివారం పట్టాభిషేకమే మిగిలింది. వచ్చే ఐదేళ్లూ దేశాన్ని నడిపించే నాయకుడు నరేంద్రమోదీయే. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జరిగిన సమావేశంలో NDAపక్ష నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదిస్తే అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ బలపరిచారు. NDAపక్ష నేతగా 3వ సారి ఎన్నికైన నరేంద్రమోదీ.. ప్రధానిగా సేవలు అందించబోతున్నారు.

NDA పక్ష సమావేశానికి హాజరైన మోదీ.. రాజ్యాంగానికి ప్రణామం చేసి ఉద్వేగంగా కనిపించారు.  బీజేపీ అగ్రనేతలు, కూటమి నేతలు మోదీకి సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీష్‌ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు వేదికపై ఉన్నారు.  ఇవాళ పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో సందడి వాతావరణం కనిపించింది. కూటమి నేతలతోపాటు BJP పాలిత రాష్ట్రాల CMలు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యనేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చింది: చంద్రబాబు

న్డీయేను అధికారంలోకి తేవడానికి ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్న మోదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ.. దేశాన్ని ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలిపారని గుర్తు చేశారు. మోదీ నేతృత్వంలో భారత్‌ పేదరిక రహితంగా మారుతుందన్నారు. సరైన వేళ సరైన వ్యక్తి ప్రధాని కావడం వల్ల దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మేకిన్‌ ఇండియాతో భారత్‌ను వృద్ధిపథంలో నడిపారని బాబు.. మోదీని ప్రశంసించారు. మోదీ సహా BJP అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్‌కు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..