Chandrababu Naidu: భూమికోసం పోరాడుతూ మరణించిన రైతు మృతిపై స్పందించిన చంద్రబాబు.. ప్రభుత్వం న్యాయం చేయలేదంటూ వ్యాఖ్యలు

న్యాయస్థానం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu Naidu: భూమికోసం పోరాడుతూ మరణించిన రైతు మృతిపై స్పందించిన చంద్రబాబు.. ప్రభుత్వం న్యాయం చేయలేదంటూ వ్యాఖ్యలు
Chandrababu Naidu

Updated on: Sep 04, 2022 | 10:12 AM

Chandrababu Naidu: తన పొలం కోసం పోరాడుతూ.. ఎప్పటికీ న్యాయం జరగక పోయేసరికి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి దుర్ఘటన తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. ఎమ్మార్వో ఆఫీసు ముందే ఓ రైతు నిరసన తెలియజేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. రామ‌కృష్ణాపురం పంచాయ‌తీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు ర‌త్నం  కబ్జాకు గురైన తన పొలం కోసం పోరాడుతూ, పెనమూరు తహశీల్దారు ఆఫీసులోనే ప్రాణాలు విడిచి పెట్టాడు. ఈ వార్త తన మనసును కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రత్నం   కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు  వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంత మంది సామాన్యులు బలికావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రశ్నించారు.

న్యాయస్థానం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు.

రామకృష్ణాపురం పంచాయితీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతుకి ప్రభుత్వం 1974లో లీజుకి కొంత భూమి ఇచ్చింది. అయితే రైతుకి భూమి దక్కకూడని.. తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు తరచూ వివాదాం సృష్టించేందుకు ప్రయత్నించేవారు. దీంతో రత్నం 2009లో చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సదరు భూమిని రత్నంకు కేటాయిస్తూ పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ రత్నం తన భూమికోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us