AP Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..

AP Rain Alert: దక్షిణ అంతర్గత ఒడిశా, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు దక్షిణ ఒడిషా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, పొరుగు ప్రాంతంలో..

AP Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు..
Rains
Follow us

|

Updated on: Jul 10, 2022 | 4:41 PM

AP Rain Alert: దక్షిణ అంతర్గత ఒడిశా, పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు దక్షిణ ఒడిషా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, పొరుగు ప్రాంతంలో విస్తరించి.. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం ఎత్తుతో నైరుతి దిశగా 7.6 కిలోమీటర్ల వరకు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంది.

రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, సికర్, శివపురి, సత్నా, ఝర్సుగూడ మీదుగా వెళుతుంది. దక్షిణ ఒడిషా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాల తీర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం, అక్కడి నుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తూర్పు-పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పమైన 20°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు వెళ్ళేకొద్ది దక్షిణం వైపునకు వంగి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వీటి ఫలితంగా ఏపీలో రాబోవు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వెదర్ రిపోర్ట్‌ను విడుదల చేశారు శాతావరణ శాఖ అధికారులు. దీని ప్రకారం..

ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే, భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. అలాగే, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర.. ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు, ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమలో వాతావరణ పరిస్థితి.. ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..