
విజయవాడ, జనవరి 21: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా.. ఓ కన్నింగ్ కేటుగాడు ఆడ వేషంలో స్కూటీపై వచ్చి వృద్ధురాలి మెడలో బంగారం గొలుసు కాజేశాడు. రోడ్డుపై చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన సంఘటన విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ నగర శివారు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు ఇంటి ముందు కూర్చుని ఉంది. అదే సమయంలో కండ్రిక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ జోసెఫ్ (32) స్కూటీపై అటుగా వచ్చాడు. ఆమె మెడలో బంగారు గొలుసు పై కన్నేశాడు. అయితే పురుషుడిగా చైన్ స్నాచింగ్ పాల్పడితే సీసీ కెమెరాల్లో పట్టుబడతానని ఆలోచనతో జోషెప్ అతని భార్య బట్టలు, బుర్కా ధరించి అచ్చు మహిళ లాగా మారి స్కూటీపై వృద్ధురాలు ఉండే ప్రాంతానికి వచ్చాడు.
అనంతరం వృద్ధురాల మెడలో చైన్ గుంజుకుని పరారయ్యాడు. ఈ ఘటనలో సీసీ కెమెరాలు పరిశీలించగా.. అందులో అచ్చం మహిళలా ఉండేసరికి పోలీసులు మొదట పొరబడ్డారు. సంఘటన స్థలంలో పరిశీలించిన వీడియో దృశ్యాలు పోలీసులు కొంత తికమక పడేలా చేశాయి. అయితే నిందితుడు వాడిన స్కూటీ ఆధారంగా మహిళ కాదని ముందుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ దిశగా విచారణ చేయగా జోసఫ్ కన్నింగ్ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది.
చైన్ స్నాచింగ్ కు పాల్పడిన జోషెప్ ను సాంకేతిక ఆధారాలతో అదుపులో తీసుకొని పోలీసు మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వగా.. మహిళ మెడలో చోరీ చేసినా బంగారు గొలుసును అప్పగించి నేరం ఒప్పుకున్నాడు. జోసఫ్ ఆటో డ్రైవర్‌గా అదే ఏరియాలో పని చేస్తూ సదరు వృద్ధురాలు బంధువుల పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లటం, తీసుకురావడం చేసేవాడు. అయితే అప్పుల బాధపడలేక ఈ మేరకు దొంగతనాన్ని పాల్పడ్డాడు. అత్యాశకు పోయి మహిళ వేషం వేసుకొని దొంగతనం చేసి చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు జోషెప్. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.