Andhra pradesh: స్వాతంత్ర్యం వచ్చి తర్వాత తొలిసారి పింగళి వెంకయ్య జయంతిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని కేంద్ర మంద్రి కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని భట్ల పెనుమర్రును సందర్శించిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గ్రామంలోని పింగళి వెంకయ్యతో పాటు మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గ్రామంలో నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనవరాలు సుశీలను కేంద్ర ప్రభుత్వం తరఫున కిషన్ రెడ్డి సత్కరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశంతో తాను పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రు వచ్చానని తెలిపారు. ఆగస్ట్ 2న ఢిల్లీలో జరిగే వేలాది మందితో జరిగే పింగళి వెంకయ్య శత జయంతి సభకు రావాలని ఆయన మనవరాలిని, కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కేంద్ర మంత్రి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి పింగళి వెంకయ్య జయంతిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇది ప్రధాని మోదీ సారథ్యంలోనే సాధ్యమైంది.
My tributes to Pingali Venkayya, designer of our National flag, on his birth anniversary. An educationist, nationalist and a visionary freedom fighter whose immense contribution will be remembered forever.#PingaliVenkayya pic.twitter.com/e3YIp2UF05
— G Kishan Reddy (@kishanreddybjp) August 2, 2018
పింగళి వెంకయ్యను మర్చిపోతే దేశం క్షమించదు. జెండా పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఇళ్లపై పింగళి వెంకయ్య రూపొందించిన జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ నాయకుల పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..