
కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందడం తెలుగు రాష్ట్రాలతో సహా యావత్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి…
— PMO India (@PMOIndia) October 24, 2025
మరోవైపు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు బస్ ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకర ఘటన అని ఆమె అన్నారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షింస్తున్నట్టు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదిగా రాష్ట్రపతి పోస్ట్ చేశారు.
The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) October 24, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.