Andhra Pradesh: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం..

|

Apr 16, 2023 | 9:04 PM

Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం నాడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

Andhra Pradesh: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశం..
Ycp Mp Avinash Reddy
Follow us on

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం నాడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ ఆఫీసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ.

కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో ఇవాళ ఉదయం అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. ధర్మాసనం ఆయనకు 14 రోజుల కస్టడీ విధించింది. అయితే, తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు అవినాష్ రెడ్డి. సీబీఐ విచారణ వ్యక్తి లక్ష్యంగా సాగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనకు కూడా సీబీఐ నోటీసులు ఇవ్వడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ మాదిరిగానే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఉంటుందా? అనే చర్చ మొదలైంది. మరి ఏం జరగనుందని తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..