YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. కీలక అనుమాతుడిని విచారించిన అధికారులు..

|

Jul 26, 2021 | 5:24 PM

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, దివంగత నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. కీలక అనుమాతుడిని విచారించిన అధికారులు..
Ys Viveka
Follow us on

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, దివంగత నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. కడప జిల్లాలోని పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్‌ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరిని, అతని భార్యను విచారించారు. ఈ హత్య కేసుకు సంబంధించి పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రాం కుమార్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. కాగా, వాచ్‌మెన్ రంగయ్య.. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో మాజీ డ్రైవర్ దస్తగిరి పేరును చెప్పాడు. ఈ నేపథ్యంలో దస్తగిరిని సీబీఐ అధికారులు మరోసారి విచారించారు. రంగయ్య ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి సహా, సునీల్ కుమార్ యాదవ్, మరికొందరు అనుమానితుల పేర్లను ప్రస్తావించాడు.

కాగా, ఢిల్లీ నుంచి కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రాం కుమార్ నేతృత్వంలోని బృందం.. వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో అసలేం జరిగింది? ఇంటి దగ్గర ఉన్న ఆనవాళ్లు ఏం చెప్తున్నాయి? అనే అంశాలపై సీబీఐ డిటేల్డ్‌గా విచారణ జరుపుతోంది. వై.ఎస్‌.వివేక హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. హత్య కేసు విచారణలో భాగంగా కడప జిల్లాలో వివేకా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా కుమార్తె సునీత, వివేకా భార్య సౌభాగ్యతో కలిసి అక్కడకు వెళ్లిన అధికారులు.. కేసుకి సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్‌కు వెళ్లారు.

అయితే, నాలుగు రోజుల క్రితం సీబీఐ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు వాచ్‌మెన్‌ రంగయ్య. వివేకా నమ్మిన బంటు, ప్రధాన అనుచరుడు అయిన ఎర్రగంగిరెడ్డికి మర్డర్‌తో లింక్ ఉందని రంగయ్య చెప్పాడు. మరో సంచలనం కూడా బయటపెట్టాడు. తన పేరు చెబితే గంగిరెడ్డి చంపేస్తా అన్నాడని కూడా వెల్లడించాడు. గంగిరెడ్డితో పాటు మిగతా ముగ్గురి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందని భయపడుతున్న రంగయ్య.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరి పేర్లు బయటపెట్టడం ఆసక్తి రేపుతోంది.

Also read:

హోం మినిష్టర్ అయితే ఏంటి..?అంబులెన్సుకు దారివ్వాల్సిందే..!పోలీస్ రియాక్షన్(వీడియో):stopping ambulance video.

Tokyo Olympics 2020 Live: నిరాశపరిచిన భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్.. సెమీఫైనల్స్‌కు డిస్ క్వాలిఫై.!

Currency Printing: కరెన్సీ నోట్లు ముద్రించనున్నారా? లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్