Gannavaram: అనుమానాస్పద స్థితిలో పెంపుడు పిల్లి మృతి.. పక్కింటివారిపై ఫిర్యాదు
ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పర్షియన్ జాతి పిల్లి.. ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఇంట్లో అది చేసే సందడిని అందరూ ఎంజయ్ చేసేవారు. ఎండల కారణంగా అది అప్పుడప్పుడు చల్లదనం కోసం పక్కింట్లోని చెట్ల కిందకు వెళ్లేది.
ఎంతో ముద్దొచ్చే పెంపుడు పిల్లి అది. అది కూడా పర్షియన్ జాతిది. ఆ ఫ్యామిలీ అంతా.. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చిన్న పాపాయిలా ముద్దు చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం వెంకటనరసింహాపురం కాలనీలో నివాసం ఉండే షేక్ చానా ఇంటికి బర్త్ డే గిఫ్ట్‌గా అది వచ్చింది. గత మార్చి నెల నుంచి ఆ పిల్లికి వాళ్లు ఫుడ్ కూడా కాస్త స్పెషల్‌గానే పెడుతున్నారు. అయితే వన్ బ్యాడ్ డే.. ఆ పిల్లి మిస్ అయ్యింది. ఎంత వెతికినా కనిపించలేదు. దానికే ఏమై ఉంటుందో అని వారంతా కంగారుపడ్డారు. వారు మదనపడ్డట్లుగానే కాసేపటి తర్వాత అక్కడి స్ట్రీట్‌లో సదరు పిల్లి విగతజీవిగా కనిపించింది. దీంతో దాని యజమాని ఫ్యామిలీ మెంబర్స్ విషాదంలో మునిగిపోయారు.
తమ ఇంటి పక్కన ఉంటన్న కుమారి అనే మహిళే దాన్ని చంపేసి ఉంటారని ఆరోపిస్తూ.. పోలీసులకు చానా కంప్లైంట్ చేశారు. గతంలో ఓ సారి పిల్లి కారణంగా వారితో గొడవ అయిందని..అప్పుడే చంపేస్తామని హెచ్చరించారని… కానీ, నిజంగానే ఇలా చేస్తారని అనుకోలేదని ఆమె వాపోతున్నారు. ప్రస్తుతం ఆ పిల్లి గర్భంతో ఉందని.. దాని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు షేక్ చానా రిక్వెస్ట్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన గన్నవరం పోలీసులు.. సెక్షన్ 429 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మాకు ఏ పాపం తెలియదని.. బహుశా వీధి కుక్కల దాడిలో అది చనిపోయి ఉండొచ్చని.. కుమారి కుటుంబీకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..