Rajya Sabha Polls: రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవం.. ఏపీలో నాలుగు.. తెలంగాణలో రెండు..

|

Jun 03, 2022 | 6:59 PM

APలో నాలుగు వైసీపీకే. తెలంగాణలో రెండు టీఆర్‌ఎస్‌కే. రెండు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎలాంటి పోటీ లేకుండానే అధికార పార్టీలు రాజ్యసభ సీట్లను దక్కించుకున్నాయి.

Rajya Sabha Polls: రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవం.. ఏపీలో నాలుగు.. తెలంగాణలో రెండు..
Rajya Sabha
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు సీట్లకు వైసీపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వారికి పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో వారు నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి నుంచి ధృవపత్రాలను తీసుకున్నారు. వైసీపీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేస్తామని, సీఎం జగన్‌ ఇచ్చే అజెండా ప్రకారం రెండు సభల్లో వాయిస్‌ వినిపిస్తామని చెప్పారు విజయసాయిరెడ్డి. బీసీలను చరిత్రలో నిలిపే విధంగా సీఎం జగన్‌ అడుగులు ఉన్నాయని ప్రశంసించారు ఆర్‌.కృష్ణయ్య. రాజ్యసభలో బీసీల వాయిస్‌ను గట్టిగా వినిపిస్తానని చెప్పారు. తెలంగాణలో రెండు సీట్లకు నామినేషన్‌ వేసిన దామోదర్‌రావు, పార్ధసారధిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి డిక్లరేషన్‌ అందించారు.

ఇవి కూడా చదవండి

ఏకగ్రీవమైన తర్వాత ఎంపీలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.