Andhra Pradesh: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఉన్మాది.. బస్సు, కార్ల అద్దాలు ధ్వంసం

|

Mar 29, 2023 | 5:14 PM

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించి అందరిని భయందోళనకు గురిచేశాడు. రోడ్డుపై వచ్చిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయాడు. పత్తికొండ పోలీస్ స్టేషన వద్ద ఈ ఘటన జరిగింది.

Andhra Pradesh: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఉన్మాది.. బస్సు, కార్ల అద్దాలు ధ్వంసం
Man Attacking Vehicles
Follow us on

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించి అందరిని భయందోళనకు గురిచేశాడు. రోడ్డుపై వచ్చిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయాడు. పత్తికొండ పోలీస్ స్టేషన వద్ద ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి రోడ్డుపై రెండు ఇనుప రాడ్లతో రోడ్డుపై నిలిపిన బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ వద్ద కొన్ని కార్లు ఆగాయి. వాటిని కూడా ఆ రాడ్లతో ధ్వంసం చేశాడు. అలాగే అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లోకి కూడా దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న ద్విచక్రవాహనాలు.. ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశాడు.

అతను అలా ఉన్మాదిగా ప్రవర్తించడం చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్కడికి వచ్చిన 10 వ తరగతి, కళాశాల విద్యార్థులు భయకంపితులయ్యారు. అతని తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది విసిగిత్తి పోయారు. చివరకు పోలీసులు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్టేషన్ లో బంధించారు. అయితే అతను అలా ఉన్మాదిలా ప్రవర్తించడన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..