Brahmamgari Matam: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదంలో మరో ట్విస్టు.. ఇవాళ మహాలక్ష్మమ్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

|

Jul 05, 2021 | 7:52 AM

ఒకరు ముందుకు వెళ్తుంటే.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. మధ్యవర్తుల మాట కూడా చెల్లడం లేదు.. అంతా గొవడ సద్దుమణిగిందనుకున్నారు.. కానీ మళ్లీ మొదటికే వచ్చింది.

Brahmamgari Matam: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వివాదంలో మరో ట్విస్టు..  ఇవాళ మహాలక్ష్మమ్మ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
Brahmamgari Matam Peetadhipathi Controversy
Follow us on

Brahmamgari Matam Pitadhipathi Controversy: ఒకరు ముందుకు వెళ్తుంటే.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. మధ్యవర్తుల మాట కూడా చెల్లడం లేదు.. అంతా గొవడ సద్దుమణిగిందనుకున్నారు.. కానీ మళ్లీ మొదటికే వచ్చింది. బ్రహ్మంగారి పీఠాధిపతి పీఠముడి ఇప్పట్లో వీడేటట్టు కనిపించడం లేదు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంలో మరో ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. పీఠాధిపతిగా వెంకటాద్రి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వీలునామాకు విరుద్ధంగా నియామకం జరిగిందంటూ రెండో భార్య మారుతీ మహాలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. వెంకటాద్రి పీఠాధిపతిగా ప్రభుత్వం జీవో జారీ చేయకుండా.. నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు మారుతి మహాలక్ష్మి.

మంత్రి జోక్యం చేసుకున్నా… మూడో వ్యక్తి ప్రమేయం వద్దని హితవు పలికినా.. కుటుంబ సభ్యులే వివాదం పరిష్కరించుకోమని ఎంత చెప్పినా.. వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. ఎన్ని సలహాలు, సూచనలు చేసినా సస్పెన్ష్ మాత్రం వీడటం లేదు. ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు చేరింది పీఠాధిపతి పంచాయితీ. మఠం పీఠాధిపతి నియామకాన్ని సవాల్‌ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు రెండో భార్య మారుతీ మహాలక్ష్మి. బెదిరించి వీలునామాపై సంతకం చేయించుకున్నారని ఇతర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించనుంది సింగిల్ బెంచ్‌ ధర్మాసనం.

ఇదిలావుంటే, ప్రభుత్వ పెద్దలు, పలువురు మఠాధిపతులు ఇరు కుటుంబాలతో చర్చించి వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారుడిని పీఠాధిపతిగా ప్రకటించారు. ఇక సమస్యకు ముగింపు పడ్డట్లే అనుకున్న టైమ్‌లో.. మారుతి మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. మారుతి మహాలక్ష్మి దగ్గర రాసిన వీలునామా చెల్లుతుందా,కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందం చెల్లుతుందా.. ఈ వ్యవహారం లో చట్ట బద్ధత కల్పించాలంటూ హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రెండో భార్య మారుతి మహాలక్ష్మి. ఇప్పటికే పూర్తి వివరాలతో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ దీనిపై విచారణ చేపట్టనున్న హైకోర్ట్‌ ఏం చెబుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Read Also..  Ap Curfew: నేడు కోవిడ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష.. కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం