Andhra Pradesh: పాము కాదు..‘పూల్’ కాటేసింది..! పాపం, లేక లేక ఆ ఇంట్లో బాబు పుడితే..

Visakhapatnam News: విశాఖలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు.. రాత్రంతా వెతికినా కనిపించలేదు. తెల్లవారుజామునే శవంగా మారాడు. రాత్రి వెతికినచోట లేని మృతదేహం తెల్లవారుజామున ఎలా వచ్చింది..? అదే ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులు అనుమానం..

Andhra Pradesh: పాము కాదు..‘పూల్ కాటేసింది..! పాపం, లేక లేక ఆ ఇంట్లో బాబు పుడితే..
Vizag Crime News

Updated on: Jun 13, 2023 | 7:36 PM

Visakhapatnam News: విశాఖలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు.. రాత్రంతా వెతికినా కనిపించలేదు. తెల్లవారుజామునే శవంగా మారాడు. రాత్రి వెతికినచోట లేని మృతదేహం తెల్లవారుజామున ఎలా వచ్చింది..? అదే ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులు అనుమానం. అది కూడా బాలుడు ఎడమ చేతి ఉంగరం వెలుపై పాము కాటు వేసినట్టు రెండు గుర్తులు. దానిపైన అనుమానమే.! చివరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అనుమానమే నిజమైంది. బాలుడు చనిపోయింది పాముకాటుతో కాదు.. స్విమ్మింగ్ పూల్ మింగేసింది. వాచ్మెన్ కూడా గ్రామస్తుడే కావడంతో.. భయపడి ఈ పని చేసి.. చివరకు అసలు విషయం కక్కేశాడు. వెళ్లి సీసీ కెమెరా వెరిఫై చేసేసరికి.. బాలుడి మృతి వెనుక ఉన్న మరణం తేలిపోయింది. పాపం లేక లేక పుట్టిన ఆ బిడ్డ లేడన్న దానికంటే.. ఆ చేదు నిజాన్ని దాచి పెట్టినందుకు బాధ్యత కుటుంబం గ్రామస్తులు కోపం కట్టలు తెచ్చుకుంటుంది.

విశాఖ పెందుర్తి ఎస్ఆర్ పురంలో బాలుడు శివతేజ అనుమానస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలుడి మరణం వెనుక హత్య కోణమా ప్రమాదమా అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఇంటికి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు పడి మృతి చెందినట్లు బయటపడడం కలకలం సృష్టించింది. అయితే.. స్విమ్మింగ్ పూల్ లో పడిన బాలుడిని బయటకు తీసి.. ఊపిరి పోయాక అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా లారీ యార్డులో పెట్టేసాడు వాచ్మెన్. ఆ తర్వాత.. వాచ్మెన్ కూడా గ్రామస్తుడు కావడంతో అసలు విషయం కక్కేసాడు. అప్పటికే అనుమానాలతో ఉన్న గ్రామస్తులు బాధిత కుటుంబం.. విషయం తెలుసుకుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంత జరిగినా కనీసం సమాచారం ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్తులు బాధిత పిల్లాడి బంధువులు.

అసలేం జరిగింది..?

ఐదేళ్ల తేజ.. లేక లేక ఆ ఇంట్లో పుట్టాడు. అక్క తర్వాత 12 ఏళ్లకు కన్నతల్లి పేగు తెంచుకుని జన్మించాడు. దీంతో గారాబంగా పెంచుకున్నారు ఆ కుటుంబం. మరోవైపు తేజ చిలిపి చేష్టలతో ఆ గ్రామం అంతా బాలుడు వెన్నంటే ఉండేది. అయితే.. అటువంటి బాలుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. అందరికీ దూరమయ్యాడు. దీంతో ఆ గ్రామం విషాదంలోకి వెళ్లిపోయింది. ఐదేళ్ల బాలుడు శివతేజ.. ఈనెల ఎనిమిదో తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెతికిన బంధువులు గ్రామస్తులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలుగా పోలీసులు కూడా గాలించారు. రాత్రంతా గ్రామస్తులు వెతికినప్పటికీ.. ఆచూకీ కనిపించలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామునే.. ఇంటికి సమీపంలోని లారీ యార్డ్ లో బాలుడు మృతదేహం కనిపించింది. నోరు ముక్కు నుంచి కాస్త నురగతో పాటు… ఎడమచేతి ఉంగరం వేలకు రెండు గాట్లు కనిపించాయి . అయితే పాము కాటుతో మృతి చెంది ఉంటాడని అనుమానించారు. మరోవైపు.. బాధిత కుటుంబం మాత్రం మృతదేహం పై ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి.. బంధువులకు అప్పగించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

పాముకాటుగా నమ్మించే ప్రయత్నం..

అయితే.. ఒకవైపు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయితే.. ఇంటికి సమీపంలోని లెందీవనంలోని స్విమ్మింగ్ పూల్ లో తేజ పడి ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణకు వచ్చారు. సిసి ఫుటేజ్ లు వెరిఫై చేసి తేజ మృతి వెనుక అసలు మర్మాన్ని తెలుసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్ నారాయణ స్వయంగా ఈ నిజాన్ని ఒప్పుకోవడంతో.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరూ లేని సమయంలో ప్రమాదవ చేత్తో పడి మృతి చెందడంతో.. భయపడి ఆ మృతదేహాన్ని లారీ యార్డ్ వద్ద పెట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాదు బాలుడి మరణం పాముకాటుగా నమ్మించే ప్రయత్నం కూడా జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు వాచ్మెన్ నారాయణ.

గ్రామస్తుల ఆందోళన

విషయం తెలుసుకున్న బాధ్యత కుటుంబ సభ్యులు గ్రామస్తులు భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎంత జరిగినా కనీసం పోలీసులు నిజం దాచి పెట్టే ప్రయత్నం చేశారని చేశారని ఆరోపించారు. అయితే, విచారణలో స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందినట్లు వెలుగు చూడడంతో పాటు.. కేసు విచారణలో ఉండడం, ఆపై శాంతిభద్రతాలు సమస్య వస్తుందేమోనన్న అనుమానంతో పోలీసులు ఆచితూచి ముందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు తెలియపరచకపోయినా.. మరోవైపు బాలుడు మృతి పై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరకు విషయం బయటకు పోక్కడంతో.. ఒప్పుకోక తప్పలేదు. స్విమ్మింగ్ పూల్ లో బాలుడు బాలుడు మృతి చెందాడని పెందుర్తి సిఐ అప్పారావు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో.. బాధ్యత కుటుంబం గ్రామస్తులు శాంతించారు. స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

బాలుడి మృతి కంటే..

ఐదేళ్ల తేజ ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. వాచ్మెన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్వయంగా వెళ్లి చూశారు. బాలుడు మృతి వెనుక కారణాన్ని తెలుసుకున్నారు పోలీసులు. మరోవైపు.. రాత్రంతా తమతో పాటు ఉన్న వాచ్ మెన్ నారాయణ.. విషయాన్ని దాచిపెట్టి బాలుడు కోసం వెతకడం, ఆపై అర్ధరాత్రి మృతదేహాన్ని లారీ అడులో పెట్టడం, అంతేకాదు, పాము కాటు వేసినట్టు రెండు గుర్తులు బాలుడి చేతి వేళ్ళు పై పొడవడం.. గ్రామస్తులను తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. స్విమ్మింగ్ పూల్ లో పడిన తర్వాత.. కొనఊపిరితో ఉన్న తేజను ఓ గదిలో ఉంచేసారని.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడని కొనవ్వడితో తమకు అప్పగించిణా తేజను కాపాడుకునే వాళ్ళమని చెబుతూ రోధిస్తున్నారు బాధ్యత తల్లి నారాయణమ్మ అక్క కృష్ణవేణి.

-ఖాజా, టీవీ9 రిపోర్టర్, వైజాగ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..