రాత్రి 12 దాటిందా విజయవాడ బస్‌స్టేషన్‌లో భయం భయం.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు..

|

Mar 24, 2024 | 1:16 PM

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో ఉన్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు.

రాత్రి 12 దాటిందా విజయవాడ బస్‌స్టేషన్‌లో భయం భయం.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు..
Vijayawada Bus Stand
Follow us on

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో ఉన్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యంసేవించి బస్టాండ్‌లోని బెంచీలపై పడుకున్నారు యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు. అయితే, అర్ధరాత్రి తాము కూర్చునేందుకు ప్రయాణికులు ప్రయత్నించినా వారు ఏమాత్రం లెక్కచేయలేదు.. అనంతరం అర్ధరాత్రి ప్రయాణికుల ఫిర్యాదుతో బస్టాండ్ నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. నిద్రలేపారన్న కారణంతో ఆర్టీసీ సిబ్బంది, పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

దాడికి పాల్పడిన వారిలో కొందరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. బస్టాండ్‌లో జరిగిన గొడవతో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు భయబ్రాంతులకు లోనైయ్యారు. తమపై కూడా ఎక్కడ దాడి చేస్తారోనని భయంతో పరుగులు తీశారు.

వీడియో చూడండి..

అయితే, కొన్ని రోజుల నుంచి బస్టాండ్‌లోని బెంచీలను బ్లేడ్‌ బ్యాచ్‌ ఆక్రమించుకుంటుందని.. యాచకులు కూడా తాగొచ్చి బస్టాండ్‌లోనే ఉంటున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో నానా హంగమా సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..