AP: రాత్రి పూట సైలెంట్‌గా ప్లాన్ చేశారు.. ఊహించని విధంగా చిక్కారు

|

Apr 02, 2022 | 6:25 PM

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టాం. టెక్నాలజీ విషయంలో దూసుకుపోతున్నాం. కానీ కొందరి నుంచి మూఢనమ్మకాలను మాత్రం దూరం చేయలేకపోతున్నాం.

AP: రాత్రి పూట సైలెంట్‌గా ప్లాన్ చేశారు.. ఊహించని విధంగా చిక్కారు
Black Magic
Follow us on

 Chittoor District:మంత్రాలకు చింతకాయలు రాలతాయా? తాంత్రిక పూజలతో గుప్త నిధులు దొరుకుతాయా? ఆధునిక యుగంలోను మూఢ నమ్మకాలు పోవడం లేదు. శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలోని తొట్టంబేడులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి ఎనిమిది మంది క్షుద్రపూజలు చేశారు. గుప్తనిధుల కోసం పూజలు చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రగాళ్లు చేసిన పూజలు స్థానికులను భయప్రాంతులకు గురిచేశాయి. ఇక్కడ క్షుద్రపూజలు చేసిన వారిలో తమిళనాడు చెందిన ఐదుగురు పూజారులు ఉన్నారు ఉన్నారు.  వీరితో పాటు తొట్టంబేడు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన ప్రకాష్‌.. అతని స్నేహితులు కుమార్, ఓం ప్రకాష్‌ను పోలీసులు లోపలేశారు. తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ప్రకాష్‌ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు. అందినకాడికి అప్పులు చేసేశాడు. వాటి నుంచి బయటపడేందుకు గుప్తనిధుల వేట మొదలుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా ఐదుగురు తమిళ మంత్రగాళ్ల సాయంతో పూజలు చేస్తుండగా తొట్టంబేడు పోలీసులు భగ్నం చేశారు.

Also Read: Hyderabad Metro: మరింత వేగంగా ప్రయాణించనున్న హైదరాబాద్‌ మెట్రో రైళ్లు.. ప్రయాణ సమయం ఆదా