Anantapur: అయ్యారే.. మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు.. వీడియో చూడండి…

పెట్ డాగ్స్‌కి, పిల్లులకు జన్మదిన వేడుకలు చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. కానీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మేకపోతుకు కూడా ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు నిర్వహించాడు. ఏం తప్పేముంది... మా ఇంట్లో పుట్టింది.. మా మధ్య పెరిగింది.. అందుకే దాని ఫ్యామిలీ మెంబర్‌లా భావించి బర్త్ డే చేశామని దాని యజమాని చెబుతున్నాడు.

Anantapur: అయ్యారే.. మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు.. వీడియో చూడండి...
Goat Birthday

Edited By:

Updated on: Mar 15, 2025 | 6:07 PM

సాధారణంగా పుట్టినరోజు వేడుకల అంటే మేకపోతుని కోసి బంధువులు, స్నేహితులకు భోజనాలు పెట్టడం మీరు చూసుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మేకపోతుకే పుట్టినరోజు వేడుకలు చేశాడు. కేక్ కట్ చేసి ఇంటిల్లపాది మేకపోతు బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు దాని యజమాని వెంకటేశులు. మూడేళ్లుగా ఆ మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు యజమాని వెంకటేశులు తెలిపాడు.

మేకపోతుకు పుట్టినరోజు వేడుకలు ఏంటా అని… ఈ వింతను చూసేందుకు గ్రామస్తులు వింతగా చర్చించుకుంటున్నారు. తన ఇంట్లో మేకకు రెండు పిల్లలు పుట్టాయని అందులో ఒకదాన్ని అమ్మివేయగా…. మరొకదాన్ని కన్నబిడ్డలా పెంచుకుంటున్నామనంటున్నాడు యజమాని వెంకటేశులు. ఈ మేకపోతు బ్రతికున్నంత వరకు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటామని యజమాని వెంకటేశులు అంటున్నారు. పుట్టినరోజు వేడుకలకు, శుభకార్యాలకు కోడి లేదా మేకపోతుని కోసి బంధువులకు భోజనాలు పెట్టే వాళ్ళని చూశాం… ఇలా మేకపోతుకు కూడా పుట్టినరోజు వేడుకలు చేయాలన్న విచిత్ర ఆలోచన యజమాని వెంకటేశులుకు రావడంతో గ్రామస్తులు వింతగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.