షర్మిల చుట్టూ ఏపీ రాజకీయం.. అధికార పార్టీపై రాజన్నబిడ్డ విమర్శనాస్త్రాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. అయితే వేడెక్కిన ఆ రాజకీయమంతా.. వైఎస్‌ షర్మిల చుట్టూనే తిరుగుతుండటం ఆసక్తి రేపుతోంది. అధికార వైసీపీనే టార్గెట్‌ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలు.. ప్రతిగా రూలింగ్‌ పార్టీ నుంచి కౌంటర్లు... రాష్ట్ర రాజకీయాల్లో కుంపట్లు రాజేస్తున్నాయి. మొత్తానికి మేటర్‌ కాస్తా.. వైసీపీ వర్సెస్‌ వైఎస్ షర్మిలగా మారిపోయింది.

షర్మిల చుట్టూ ఏపీ రాజకీయం.. అధికార పార్టీపై రాజన్నబిడ్డ విమర్శనాస్త్రాలు
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2024 | 7:02 PM

ఏపీ కాంగ్రెస్‌ సారథిగా కొత్త ఇన్నింగ్స్‌ మొదలెట్టిన వైఎస్‌ షర్మిల… రాష్ట్ర రాజకీయాల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అవుతున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో జోష్‌ నింపేందుకు జిల్లాల పర్యటన మొదలెట్టిన ఆమె… ప్రధానంగా అధికార వైసీపీనే టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది. కాకినాడలో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఉద్దేశించి వైసీపీ చేస్తున్న విమర్శలకు.. అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చారు షర్మిల.

అయితే, రాజన్న బిడ్డగా షర్మిలను గౌరవిస్తాం.. ప్రత్యర్థిగా విమర్శలు గుప్పిస్తే మాత్రం తగ్గేదేలే అంటున్నారు వైసీపీ నేతలు. ఆమె మాటలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇస్తామంటున్నారు. అసలు, వైసీపీలో షర్మిలకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలని ప్రశ్నించారు సజ్జల.

షర్మిల మాటలు, వ్యవహారశైలి చూస్తే జాలేస్తుందని మంత్రి బొత్స అంటే… ఆమె మాటల్ని జనాలెవరూ నమ్మరన్నారు మరో మంత్రి మేరుగ నాగార్జున. షర్మిల ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి చెల్లుబోయిన వేణు అంటుంటే… అసలు షర్మిల ఆడపిల్లో ఈడపిల్లో తేల్చుకోవాలంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్నినాని.

ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న షర్మిల అధికార పార్టీని నేరుగా టార్గెట్‌ చేయడం… అటువైపు నుంచి కూడా అదేస్థాయిలో కౌంటర్లు వస్తుండటం… పొలిటికల్‌గా కాకపుట్టిస్తోంది. వైసీపీ ముఖ్యనేతలంతా మూకుమ్మడిగా షర్మిలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే.. వార్‌ డిక్లేర్‌ అయినట్టే కనిపిస్తోంది. మరి, ఎన్నికలనాటికి ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.