YS Sharmila vs Sajjala: ఏపీలో రాజకీయ కాక.. YS షర్మిల – సజ్జల మధ్య మాటల యుద్ధం -Watch Video
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ జాతీయ న్యూస్ ఛానల్ కాంక్లేవ్ వేదికగా సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వంలో అమలుకావడం లేదని ఆరోపించారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ జాతీయ న్యూస్ ఛానల్ కాంక్లేవ్ వేదికగా సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ షర్మిల తిప్పికొట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వంలో అమలుకావడం లేదని ఆరోపించారు. నేడు వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారేనని వ్యాఖ్యానించారు. దీనికి సాక్ష్యం దేవుడు, తన తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ అన్నారు. అయితే షర్మిల వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని ఆరోపించారు. షర్మిల ఒక్కరే కాదు వైసీపీలో అందరూ కష్టపడ్డారని.. పదవుల కోసం కుటుంబాలు చీలిపోవాలా? అని ప్రశ్నించారు.
అటు బీజేపీకి తొత్తులా వైసీపీ వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించగా.. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారు. పోరాటం ఎలా చేయాలో షర్మిల చెప్పాలన్నారు.
జగన్ సీఎం అవడం కోసం తాను ఎంతో చేస్తే తనకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. అయితే ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.