ఏపీలో మళ్లీ కుల రాజకీయాలు జోరందుకున్నాయి. ఓట్లు, సీట్లు లక్ష్యయంగా ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి కులసమీకరణాలపై దృష్టి పెట్టాయి ప్రధానపార్టీలు. కాపు వర్గం లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. కులానికి ఐకాన్‌లుగా ఉన్న కుటుంబాలకు దగ్గరయ్యేందుకు అధికార వైసీపీ వ్యూహాలు పన్నుతుండగా.. అలర్ట్ అయిన జనసేన కూడా పెద్దలకు ఆహ్వానం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
ఏపీ రాజకీయాల్లో కాపు సెగ.. బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. <<<< Spot
2019లో కాపు ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని ముద్రగడకు దగ్గరైన వైసీపీ మరోసారి ఆ వర్గంలో పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యమాలకు పరిమితమైన ముద్రగడను తమ పార్టీ నుంచి పోటీచేయించాలనుకుంటోంది అధికారపార్టీ. జనసేన-టీడీపీ కూటమిని గోదావరి తీరంలో ఢీకొట్టాలంటే ముద్రగడ వంటి సీనియర్లు అవసరముందని సీఎం జగన్ భావిస్తున్నారు. మరోవైపు కృష్ణాతీరంలోనూ పట్టు చేజారకుండా ఉండేందుకు వంగవీటితో మంత్రాంగం జరుపుతోంది. ఇప్పటికే కాపు సామాజికవర్గంలోని కొందరు నాయకులు అధికారపార్టీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అధికారపార్టీ వ్యూహాలతో అలర్ట్ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సొంత సామాజికవర్గానికి బహిరంగలేఖ రాశారు. కొందరు పెద్దలు తనను ధూషించిన దీవెనలుగా తీసుకుంటామన్నారు. కాపుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు పవన్. పెద్దలు ఎప్పుడు తన పార్టీలోకి వచ్చినా ద్వారాలు తెరిచే ఉంటాయంటూ సీనియర్లకు స్వాగతం పలుకుతున్నారు పవన్‌కల్యాణ్. కాపులు అత్యధికంగా ఉండే నియోజకవర్గం జగ్గంపేట నుంచే జగన్ కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పినా ఆయనకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్.
మరోవైపు కాపులను తమవైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం కూడా సిద్ధమవుతోంది. అవసరం అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మిత్రపక్షం జనసేనకు అత్యధికంగా సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఇక కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనంటోంది తెలుగుదేశం. మొత్తానికి ఎవరికి వారు కాపులకు ఛాంపియన్ మేమంటే మేమని ప్రజల్లోకి వస్తున్నారు. మరి కాపు సామాజికవర్గం ఏమంటోంది?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..