మాయమాటలతో నమ్మిస్తాడు.. మనీతో ఎస్కేప్ అవుతాడు.. 22 సార్లు జైలుకెళ్లినా.. పద్దతి మార్చుకోని బీటెక్ దొంగ..

|

Nov 23, 2020 | 11:32 AM

మాయమాటలు చెప్పి మనుషులను నమ్మించి వంచించడంలో ఇతడు పీహెచ్‌డీ చేశాడు. మాటలతో మనుషులను ఇట్టే ఐస్ చేసి తన పని కానిచ్చుకుపోతాడు.

మాయమాటలతో నమ్మిస్తాడు.. మనీతో ఎస్కేప్ అవుతాడు.. 22 సార్లు జైలుకెళ్లినా.. పద్దతి మార్చుకోని బీటెక్ దొంగ..
Follow us on

మాయమాటలు చెప్పి మనుషులను నమ్మించి వంచించడంలో ఇతడు పీహెచ్‌డీ చేశాడు. మాటలతో మనుషులను ఇట్టే ఐస్ చేసి తన పని కానిచ్చుకుపోతాడు. చదివింది బీటెక్, చేసేది లాబీయింగ్. ఇప్పటికే ఇతగాడిపై 33 కేసులు నమోదు కాగా 22 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అయినా పద్దతి మార్చుకోవడం లేదు..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశాడు. ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 2008లో తణుకులో ఒకరి దగ్గరి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. బయటికి వచ్చిన బాలాజీ నాయుడు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకొని తన అక్రమ దందాను కొనసాగించాడు. ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్ చేసి యువతకు తెలియజేయాలని కోరేవాడు. ఆ తర్వాత వారి దగ్గరి నుంచి డిపాజిట్ పేరుతో దోచుకొని ఉడాయించేవాడు. ఇదే కేసులో 2009లో విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం పీఎస్ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలంటూ నాయకుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి జైలు పాలయ్యాడు.

2013లో బీజేపీ నేత రాం జగదీశ్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై వచ్చాక ఎంపీలు వి. హనుమంతరావు, దేవేందర్ గౌడ్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలను మోసం చేసి డబ్బులు కాజేశాడు. 2015లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేకు రూ.90 లవేలు టోకరా వేసి పోలీసులకు చిక్కాడు. ఇలా చాలా కేసుల్లో అరెస్ట్ అవడం బయటికి రావడం జరిగింది. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షలు ఇప్పిస్తానని చెప్పి రూ.2.5 లక్షలను తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. ఈ కేసుపై అతడిని శ్రీకాళహస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు.