Andhra Pradesh: లోకేష్‌‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారా..? క్లారిటీ ఇచ్చిన APSRTC

|

Feb 08, 2023 | 9:02 AM

టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

Andhra Pradesh: లోకేష్‌‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారా..? క్లారిటీ ఇచ్చిన APSRTC
Nara Lokesh
Follow us on

టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, లోకేష్ పాదయాత్ర పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది. పాదయాత్రలో ఓ ఏపీఎస్‌ఆర్టీసీ బస్ డ్రైవర్‌ లోకేష్ తో కరచాలనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డ్రైవర్ తన మొబైల్‌కు ఉన్న చంద్రబాబు కవర్‌ను అందరికీ చూపిస్తూ కనిపించారు. అయితే ఆ ఆర్టీసీ బస్ డ్రైవర్ తనకు కరచాలనం చేశారని ఉద్యోగం నుంచి తొలగించారని లోకేష్ ఆరోపించడం కలకలం రేపింది. తనకు మద్దతు తెలిపినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారంటూ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ డ్రైవర్ టీడీపీ, లోకేష్ పట్ల అభిమానాన్ని చూపించారని ఉద్యోగం నుంచి తొలగిస్తారా..? అలాగైతే పోలీస్ స్టేషన్లలో వైసీపీ నేతలతో కేకులు కట్ చేయించిన వాళ్ళ సంగతి ఏంటి? తమ శాడిజానికి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తారా? అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొంతమంది ఇది నిజమా..? కాదా..? అనే విషయాన్ని ఆర్టీసీ దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో ట్విట్టర్ వేదికగా ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ఇది తప్పుడు వార్త అంటూ ఖండించింది.

ఇవి కూడా చదవండి

‘‘ఇదంతా తప్పుడు ప్రచారం.. డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలిగించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వాదనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన సోషల్ మీడియా నిర్వాహకులపై APSRTC తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది’’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..