ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డ్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్ధి పేరు, రోల్ నంబర్, ఎగ్జాం సెంటర్, టైమింగ్స్ వంటి వివారలు సరిగ్గాఉన్నయో లేదో చెక్ చేసుకోవల్సి ఉంటుంది. ఏవైనా తప్పులు దొర్లితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
మే 28 నుంచి 30వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ఈ ఏడాదికిగాను ఏపీ పీజీఈసెట్ 2023 పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. కాగా ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సారానికి ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్ససీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.