AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ..

ఏపీలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు సీఎన్జీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకతో మెరుగైన ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ..
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Oct 15, 2026 | 8:43 AM

Share

ఏపీలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. కొత్త బస్సులు త్వరలో రోడ్డెక్కేందుకు స్వరం సిద్దమైంది. మొత్తం 3 వేల బస్సును ప్రారంభించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. వీటిల్లో ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్టీజీ సీఎండీ శివప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో 750 బస్సులు ప్రారంభించనుండగా.. మిగతా బస్సులు 2027 చివరికల్లా అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొత్త బస్సుల కోసం టెండర్లను ఆహ్వానిస్తుండగా.. వివిధ సంస్థలు బస్సులను సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో టెండర్లను ఖరారు చేస్తున్నారు. విడతల వారీగా కొత్త బస్సులు ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ బస్సుల రాకతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి రానుంది. పీఎం ఈ బస్ సేవా కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా.. ఈ ఏడాది చివరి నాటికి ఇవి రోడ్లపైకి రానున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి బస్సులు

ఎలక్ట్రిక్ బస్సులతో పాటు సీఎన్‌జీ బస్సులను కూడా తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి 500 సీఎన్జీ బస్సులను తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం బస్సుల కొనుగోలుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. టెండర్లు ఖరారు అయిన తర్వాత కొత్త బస్సుల సరఫరా సంస్థల నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జులై నాటికి మరో 1450 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. వారికి రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఎస్బీఐ ద్వారా వారికి శాలరీ అకౌంట్లతో పాటు రూ.30 లక్షల బీమా కవరేజీ అందుబాటలోకి తీసుకురానున్నారు. వారి భద్రత, రక్షణ కోసం ఇది ఉపయోగపడనుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు జేఎండీ శివప్రసాద్ స్పష్టం చేశారు.

వారికి రూ.30 లక్షల బీమా కవరేజీ

ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే 8500 మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్లతో పాటు ప్రమాద బీమా త్వరలో కల్పించనున్నారు. అటు ఆర్టీసీ సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడేది లేదన్నారు. అటు దసరా, దీపావళి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తీసుకొస్తుంది. దసరాకు 5 వేలకుపైగా ప్రత్యేక బస్సులను తిప్పనుంది. వచ్చే నెలలో రానున్న దీపావళికి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.  కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ ఉంటుంది. కొత్త బస్సుల రాకతో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

Follow Us