AP Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు!

Andhra Pradesh: ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు రఘురామను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్‌ విప్‌, విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది..

AP Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు!

Updated on: Nov 12, 2024 | 11:39 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజును పేరును ఖరారు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి నేతలు ఈయన పేరును ప్రతిపాదించారు. దీంతో ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు రఘురామను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇక అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి