Mukesh Kumar Meena: ఏపీ ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్ మీనా నియామకం..
Mukesh Kumar Meena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్ మీనా నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం
Mukesh Kumar Meena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్ మీనా నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.1988-బ్యాచ్ అధికారి అయిన ముఖేష్‌కుమార్ మీనా గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా, పర్యాటక రంగ కార్యదర్శిగా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్‌గా, వాణిజ్యం పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడగించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించారు. సీఎస్ పదవీకాలం నవంబరు 30 వరకు కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్నికేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎస్ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.