AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. రానున్న మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
బంగాళా ఖాతంలో తదుపరి 48 గంటలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు మూడు రోజుల పాటు వాతావరణ సూచన చేసింది.
AP Weather Alert: ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీంతో వాయువ్య ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద దాదాపు 2022 సెప్టెంబర్ 18 వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో తదుపరి 48 గంటలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.
My dear People of #AndhraPradesh, between September 18th to 23rd we have LOW PRESSURE affecting us. There won’t be severe flooding rains, but rains ahead for North Andhra and Central Andhra. A Detailed post will be given soon.
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) September 16, 2022
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు , ఎల్లుండి (సెప్టెంబర్ 18వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు, రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 18వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈరోజు, రేపు , ఎల్లుండి(సెప్టెంబర్ 18వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..