AP Weather Alert: మరింత బలపడనున్న అల్పపీడనం.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

Nov 10, 2022 | 9:27 AM

ఈ అల్పపీడనం బలపడి సముద్రతీర జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ వైపు రానున్నదని.. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

AP Weather Alert: మరింత బలపడనున్న అల్పపీడనం.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Report
Follow us on

నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, అల్పపీడనం కారణంగా పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని పేర్కొంది. ఈ అల్పపీడనం బలపడి సముద్రతీర జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ వైపు రానున్నదని.. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇవి కూడా చదవండి

 

ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా, తిరుపతి సహా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ సహా తమిళనాడు లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..