Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇళ్లలోంచి బయటకు రావొద్దంటు హెచ్చరికలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇళ్లలోంచి బయటకు రావొద్దంటు హెచ్చరికలు
Ap Weather Update

Updated on: Oct 23, 2025 | 12:24 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతున్న ఈ అల్పపీడనం.. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటి నుంచి రాబోయే 24 గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ కూడా జారీ చేసింది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షంతో పాటు తీరం వెంబడి 30-50కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అలాగే భారీ వర్షాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని తెలిపింది. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో ప్రజలు ఎవరూ ఉండరాదని.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.