AP Weather Alert: దక్షిణకోస్తాతీరం వెంబడి గాలులు.. రాగాల మూడు రోజులలో ఏపీలో వివిధప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..

|

Dec 12, 2021 | 3:40 PM

AP Weather Alert: బంగాళా ఖాతం నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు...

AP Weather Alert: దక్షిణకోస్తాతీరం వెంబడి గాలులు.. రాగాల మూడు రోజులలో ఏపీలో వివిధప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..
Ap Weather
Follow us on

AP Weather Alert: బంగాళా ఖాతం నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ గాలులు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందో చెప్పారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్లకురిసే అవకాశముంది . ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ: ఈ రోజు , రేపు . ఎల్లుండి రాయలసీమ లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Also Read:  రేపు మోడీ కలల ప్రాజెక్ట్ ప్రారంభం..వారణాసిలో 16లక్షల లడ్డుల పంపిణీకి ఏర్పాట్లు..