AP Tenth Class Exam Results: ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. జూన్ రెండో వారంలో టెన్త్ (AP SSC Results) ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షా పత్రాల ముల్యాంకనం ముగిసిందని.. జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండొచ్చునన్నారు. 10వ తరగతి పరీక్షా పత్రాల ముల్యాంకనంలో సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ మొదలైంది. ఇప్పటికే.. అన్ని జిల్లాల మూల్యాంకన నివేదికలు ఒక్కొక్కటిగా విజయవాడకు చేరుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. దీంతో ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు ఫలితాల విడుదలకు కసరత్తులు చేస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..