AP SSC 2021 Results: ఏపీలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం (ఆగస్టు 6) సాయంత్రం 5 గంటల పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను ఏపీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరీక్షల ఫలితాల కోసం హైపవర్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. అలాగే మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
కాగా.. కరోనా కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవలే ఇంటర్ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో అందరినీ పాస్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫలితాల వెల్లడి, రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో రిజల్ట్స్ వెల్లడికి అనువైన విధానంపై హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేసింది.
Also Read: మైకంలో మునిగి తేలారు.. జులై నెలలో మద్యం అమ్మకాలు తెలిస్తే మైండ్ బ్లాంకే