AP SSC Results 2021: ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!

|

Jul 12, 2021 | 1:03 PM

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థుల మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు ఎండ్ స్టేజ్‌కు చేరింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా..

AP SSC Results 2021: ఏపీలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు ఇలా ఇవ్వనున్నారు..!
AP SCC Results
Follow us on

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థుల మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్‌ కమిటీ కసరత్తు ఎండ్ స్టేజ్‌కు చేరింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.  అంతర్గత మార్కుల ఆధారంగానే గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పదోతరగతి విద్యార్థులకు 2020-21 అకడమిక్ ఇయర్‌లో రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. ఫార్మెటివ్‌-1లో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకొని, వాటిని సరాసరి చేస్తారు. ఒక సబ్జెక్టు సరాసరి మార్కులు వస్తాయి. ఇలాగే ఫార్మెటివ్‌-2ను చేస్తారు. ఈ రెండింటిని కలిపి లెక్కలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 50మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్‌-1 సరాసరిన 45మార్కులు రాగా.. ఫార్మెటివ్‌-2లో 47 మార్కులు వస్తే ఈ రెండు కలిపి 92మార్కులుగా తీసుకుంటారు. దీని ప్రాతిపదికన మొత్తం గ్రేడ్‌, సబ్జెక్టు గ్రేడ్‌ ఇస్తారు. అంతర్గత మార్కుల విధానం అమలుకు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

గతేడాది(2019-20) టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేసి, ఎలాంటి మార్కులూ ఇవ్వలేదు. అందరూ పాసైనట్ల ప్రకటించారు. ఆర్మీ జాబ్స్‌కు మార్కులు అవసరం అవుతున్నందున విద్యార్థుల నుంచి ఎక్కువ కంప్లైంటులు వస్తున్నాయి. మార్కులు కావాలని అడిగిన వారికి ఇప్పటి వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తోంది. స్టూడెంట్స్ అందరికీ మార్కులు ఇచ్చేందుకు ఛాయరతన్‌ కమిటీ సిఫార్సు చేసింది. పిల్లల సమస్య దృష్ట్యా అందరికీ గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని సూచించింది.

Also Read: పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

1300 కిలోల బరువు భారీ సొర చేప వలకు చిక్కితే సిరుల పంటే అనుకున్నారు… కానీ