ఇవాళ రాష్ట్ర గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ.. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై నివేదిక..!

|

Jan 27, 2021 | 8:41 AM

ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు.

ఇవాళ రాష్ట్ర గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ.. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై నివేదిక..!
Follow us on

AP SEC meet Governor : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ భేటీ కానున్నారు. రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 10:15 గంటలకు గవర్నర్‌ను ఎస్‌ఈసీ కలవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సుప్రీం తీర్పు అంశాలు, ఎన్నికల ప్రక్రియ అంశాలు, షెడ్యూల్ వివరాలు గవర్నర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. అలాగే, అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యల గురించి గవర్నర్‌కు ఎస్‌ఈసీ తెలపనున్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్డు ద్విసభ్య కమిటీ ధర్మాసనం స్థానికలు జరుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాగా, పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన ఆవస్యకత తదితరాలపై గవర్నర్‌కు ఎస్ఈసీ వివరించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఆటంకం లేకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రమేష్ కుమార్ గవర్నర్‌కు నివేదించే అవకాశముంది.

Read Also… ఇవాళ నంద్యాల విజయ డెయిరీ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, విపక్షాలు