Andhra Pradesh: అఫీషియల్.. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటినుంచంటే?

|

Apr 26, 2023 | 7:45 AM

మే 1 నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్. జూన్ 12 నుంచి తిరిగి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Andhra Pradesh: అఫీషియల్.. ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటినుంచంటే?
Follow us on

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది జగన్ సర్కార్. మే 1 నుంచి సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి గానూ చివరి వర్కింగ్ ఏప్రిల్ 30వ తేదీగా పేర్కొన్నారు. చివరి రోజు విద్యార్ధులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేసింది.