AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..? ప్రభుత్వం నుంచి బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేస్తే..

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు-మొబైల్ నెంబర్ లింకింగ్ తప్పనిసరి చేసింది. రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల లబ్దిదారులను గుర్తించడం సులువవుతుంది.

Ration Card: రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..? ప్రభుత్వం నుంచి బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేస్తే..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 7:11 AM

Share

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థలో అనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. ఏటీఎం తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది. దీంతో పాటు బియ్యంతో పాటు రేషన్ సరుకుల్లో మరిన్ని నిత్యావసరాలను చేర్చింది. పంచదార కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ లాంటి వాటిని కూడా రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించేందుకు సిద్దమైంది. అయితే రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టడం, సరుకులు పక్కదారి పట్టకుండా చూసేందుకు తాజాగా కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నారా..?

రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ప్రతీఒక్క రేషన్ కార్డు వినియోగదారుడు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేషన్ డీలర్ల వద్ద ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. రేషన్ షాపుకు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందిగా డీలర్‌ను కోరాలి. దీంతో డీలర్ తమ వద్ద ఉన్న పరికరం ద్వారా మీ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు. దీనికి సంబంధించి డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లింకింగ్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతను వారికి అప్పగించారు. ఇప్పటికే రేషన్ కార్డుకు కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది ఈ ప్రక్రియ పూర్తి చేయగా.. 10 శాతం మంది ఇంకా పూర్తి చేయలేదు. రేషన్ కార్డులో పేరు ఉన్న 5 ఏళ్ల వయస్సు నుంచి 80 సంవత్సరాల్లోపు వారు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు తీసుకోవడంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. రేషన్ కార్డులో పేరు ఉన్నవారందరూ కేవైసీ పూర్తి చేయాలి.

రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ ఎప్పుడంటే..?

రేషన్ షాపులు ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఉంటాయి. వృద్దులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. వాహనాల ద్వారా వారికి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నారు.

Follow Us
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ