AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Weather: ఇదేం ట్విస్ట్ గురూ.. ఒకటి కాదు.. బ్యాక్ టూ బ్యాక్.. 2 అల్పపీడనాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని ప్రభావితం చేయనుంది. రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు చేశారు అధికారులు. బిగ్ అప్ డేట్ ఏంటంటే.. దీని వెనకే మరో అల్పపీడనం కాచుకుకూర్చుంది ... .. ..

Andhra Weather: ఇదేం ట్విస్ట్ గురూ.. ఒకటి కాదు.. బ్యాక్ టూ బ్యాక్.. 2 అల్పపీడనాలు
Weather Update
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2025 | 9:58 PM

Share

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం (17-11-2025) ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. అల్పపీడనం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అయితే ఇక్కడ మరో అప్ డేట్ కూడా ఉంది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధానమైన విషయం ఏంటంటే.. రైతులు, రైతు కూలీలు ఇలా ఎవరైనా సరే.. వర్షాలు పడుతుంటే.. చెట్ల కిందకు వెళ్లవద్దు. ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడే చాన్స్ ఉంటుంది. అందుకే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందండి.

ఇటు అల్పపీడనం కొనసాగుతున్నా..  తెలుగు రాష్ట్రాలను చలి పులి వదలడం లేదు. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD చెబుతోంది. తీవ్రత పెగరడంతో ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు.  నవంబర్‌లోనే చలి ఇంత తీవ్రతగా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో ఎలా ఉంటుందో అని జనం బెంబేలెత్తుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.