ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఫిబ్రవరి 19) ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిముషాల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 291 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెల్పింది. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత వెబ్‌సైట్ SCTSI-PWT@slprb.appolice.gov.inలో ఆన్‌లైన్ విధానంలో సూచించిన విధంగా మెయిల్ ద్వారా అభ్యంతరానలు లేవనెత్తాలని తెల్పింది.
అభ్యంతరాల స్పీకరణ ఫిబ్రవరి 23తో ముగుస్తుందని బోర్డు వెల్లడించింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను రానున్న రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.71 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా లక్షన్నర మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.