AP police action on loan apps: సంచలనం సృష్టించిన లోన్ యాప్ సూసైడ్ కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. హరిత ఆత్మహత్యకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని నిర్థారించిన పోలీసులు.. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారంతా MSR, SLV ఏజెన్సీ ఉద్యోగులుగా తెలిపారు. ఈ ఏడుగురిలో పవన్, సాయి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. హరిత కుటుంబ సభ్యులను అవమానించినట్టు వాళ్లు విచారణలో ఒప్పుకున్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని ఓ బిల్డింగ్‌లో కాల్ సెంటర్ ఏర్పాటుచేసి లోన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట కేంద్రంగా ఈ రికవరీ ఏజెన్సీ నడుస్తోంది. దాంతో, బేగంపేట మేనేజర్ మాధురిని కూడా విచారించారు. తమను దారుణంగా అవమానించారని, ఆ బాధను తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీళ్లు పెట్టుకుంది తల్లి. మీకు చదువులెందుకు గేదెలు కాచుకోమంటూ హేళన చేయడంతోనే సూసైడ్ చేసుకుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆర్‌బీఐ గైడ్ లైన్స్ గైడ్‌లైన్స్ ప్రకారమే రికవరీ చేయాలి తప్ప.. వాళ్లను అవమానించడం లాంటివి చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే కఠినచర్యలు తప్పవంటూ లోన్ రికవరీ ఎజెంట్లను హెచ్చరించారు. లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోవడం, బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ సమస్యపై సీరియస్‌గా దృష్టిపెట్టారు ఏపీ పోలీసులు. మరొకరు లోన్ యాప్స్ వేధింపులకు బలికాకుండా చర్యలు చేపడుతున్నారు. ఎవరైనాసరే ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారమే రికవరీ చేయాలని, అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి