AP Panchayat Elections: ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 36 సర్పంచ్ స్థానాలు, 68 వార్డులకు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు వార్డు సభ్యుల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. రాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండగా..30 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు చోట్ల ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. మిగిలిన 30 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇక ఏకగ్రీవాలు పోగా మిగిలిన 68 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటాకల్ తప్పనిసరి చేశారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అధికంగా వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకులం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు, విశాఖ, చిత్తూరు, కర్నూలు, కృష్ణా, అంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పోలింగ్‌లో అన్ని జిల్లాల్లో 60 శాతం నుంచి 90 శాతం వరకు పోలింగ్ నమోదైంది.
కాగా, ఈ మినీ పల్లె పోరును ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాదు సీసీ కెమెరాలతోపాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు అధికారులు. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి.
ఇవి కూడా చదవండి: