AP Panchayat Elections: నేటితో ముగియనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. 3,328 గ్రామ పంచాయతీలకు పోలింగ్
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. గురువారం రాత్రితో రెండు విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. రెండో విడతలో 3,328 గ్రామ ...
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. గురువారం రాత్రితో రెండు విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. అయితే రెండో విడతలో 2,789 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 7,510 ఉండగా, మొత్తం 33,570 వార్డు స్థానాలకు ఎన్నికలు, అందులో 12,605 ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన 20,965 వార్డు స్థానాలకు, 44,879 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 13న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కాగా, ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అటు ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల కమిషన్‌కు మధ్య వార్ కొనసాగుతోంది. అలాగే ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
Also Read: AP Panchayat Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల బరిలో భార్యాభర్తలు.. ఇద్దరూ జోరుగా ప్రచారం