రాయదుర్గం హెచ్‌ఎల్సీ కాలువ గట్టుపై క్షేద్ర పూజల కలకలం.. హత్య కేసును పక్కదాని పట్టించేందుకేనంటూ అనుమానాలు
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని హెచ్‌ఎల్సీ కాలవ గట్టుపై క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి చంపేసి కాలువలో పడేశారు దుండగులు....
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని హెచ్‌ఎల్సీ కాలవ గట్టుపై క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తిని కొట్టి చంపేసి కాలువలో పడేశారు దుండగులు. యువకుడిని బండరాయితో కొట్టి హత్య చేసి కాల్చిపడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హత్య కేసును పక్కదారి పట్టించేందుకు ఇలా క్షుద్ర పూజలు చేశారని పోలీసులు అభిప్రాయపడతున్నారు. కాలువ గట్టుపై క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. క్షద్రపూజల స్థలంలో నిమ్మకాలు, ఆకులు తదితర వస్తువులను గుర్తించారు. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Pharmacy Student: బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారయత్నం కేసు.. కీలక విషయాలు బయటపెట్టిన వైద్యురాలు